Wednesday, April 30, 2025
Homeఆంధ్రప్రదేశ్మే డే గోడపత్రిక విడుదల

మే డే గోడపత్రిక విడుదల

Listen to this article

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)

షాద్నగర్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మేడే వాల్ పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ హాజరై మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం అమెరికా దేశంలో చికాగో నగరంలో పెట్టుబడిదారులకు కార్మికులకు మధ్య జరిగిన పోరాటంలో లాటి దెబ్బలతో తుపాకి తూటాలకు రక్తం చిందించి ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్నారు ఈ 8 గంటల పని విధానాన్ని. ఆ కష్టజీవుల,శ్రమజీవుల, కార్మికుల, నెత్తుటి మడుగులోంచి పుట్టిందే ఈ ఎర్రజెండా. కార్మికులు సాధించిన ఈ విజయాన్ని కార్మిక దినోత్సవం గా మే ఒకటవ తేదీన మే డే గా ప్రకటించడం జరిగింది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదంతో కార్మికులంతా ఏకమై కలిసికట్టుగా సాధించుకున్న ఈ విజయాన్ని కార్మికులంతా 139 వ మేడే ను ఒక పండగల జరుపుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా మే 20వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు యాదయ్య రాజు, జంగయ్య అంజమ్మ శంకరయ్య కుమారు శివ చెన్నకేశవులు కమలమ్మ మమత వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments