
పయనించే సూర్యుడు గాంధారి 29-04-25
గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు అధ్యాపకులు. ఇటీవల వెల్లడించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు గత రెండు రోజుల నుండి ప్రత్యేక తరగతులు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారం వెల్లడించారు. వచ్చే నెల 22వ తేదీ నుండి అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థుల కోసం అన్ని సబ్జెక్టుల లెక్చరర్లు కళాశాలకు వచ్చి ఫెయిల్ అయిన సబ్జెక్టులను బోధిస్తున్నారు. అలాగే ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు అందిస్తున్నారు. ఒకరోజు కళాశాలలో మరో రోజు ఆన్లైన్ లో సైతం శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కాలేజీకి రాని విద్యార్థులు ఆన్లైన్లో తరగతులకు హాజరుకావాలని సూచించారు. ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారో జాబితా తయారుచేసి నా ఆయా సబ్జెక్టుల లెక్చరర్లు దాని ఆధారంగా ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. ప్రతిరోజు తరగతులకు హాజరై అధ్యాపకులు చెప్పిన విధంగా మంచిగా చదువుకుంటే విద్యార్థులు పాస్ అయ్యే అవకాశం ఉంటుందని ప్రిన్సిపాల్ వెల్లడించారు. అందుకోసం తల్లిదండ్రుల సైతం తమ పిల్లలను స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ తొ పాటు అధ్యాపకులు కోరుతున్నారు.
మీ ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం, మరియు అధ్యాపక బృందం. ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారి.