
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 30//మక్తల్
నిన్న గద్వాల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం గురురావు లింగంపల్లి గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని మహేశ్వరి భౌతికకాయాన్ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి మరణించడం చాలా బాధాకరమైన తెలిపారు. అనంతరం మహేశ్వరి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.
