
పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బసవేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వ గురు మహాత్మ శ్రీ బసవేశ్వర 892 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూఢనమ్మకాలు బలంగా ఉన్న పూర్వపు రోజుల్లో తన బోధనల ద్వారా ప్రజలను మూఢాచారాల నుండి కాపాడారని అన్నారు. సమాజంలో కుల, వర్ణ లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని గుర్తు చేశారు అని చెప్పారు. సమానత్వాన్ని బోధించిన అభ్యుదయ వాది మహాత్మ శ్రీ బసవేశ్వర అని కొనియాడారు. 12వ శతాబ్దపు భారతీయ రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు శివ- కేంద్రీకృత భక్తి ఉద్యమాలలో సామాజిక కార్యకర్త అయినా బసవేశ్వరుడు తన కవిత్వం ద్వారా సామాజిక అవగాహన వ్యాప్తి చేశారు, దీనిని వచనాలు అని పిలుస్తారు అని తెలిపారు. మహాత్మ శ్రీ బసవేశ్వర జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షణీయమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, బీసీ వెల్ఫేర్ అధికారి ణి బి. ఇందిరా, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, తూనికల కొలతలు అధికారి మనోహర్, ఉపాధి కల్పనా అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.