Thursday, May 1, 2025
Homeఆంధ్రప్రదేశ్మెగా డీఎస్సీ కాదు… ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని కోరుతూ చింతూరు ఐ టి...

మెగా డీఎస్సీ కాదు… ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని కోరుతూ చింతూరు ఐ టి డి ఎ ముందు ధర్నా

Listen to this article

2 న మన్యం బంద్ జయప్రదానికై పిలుపు


పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 30 అల్లూరి సీతారామరాజు జిల్లా

చింతూరు మండలంలో మెగా డీఎస్సీ వద్దు ఫిఫ్త్ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి ప్రకటించి 100% ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులకు ఇవ్వాలని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మినహాయింపు ఇచ్చి ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని అదేవిధంగా జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించి ప్రత్యేక చట్టం చేయాలని ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోని ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేకూర్చాలని కోరుతూ బుధవారం నాడు చింతూరు ఐటీడీఏ ముందు వివిధ ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగులు, ప్రస్తుత డీఎస్సీ అభ్యర్థులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రత్యేక హక్కులు చట్టాలు ఆదివాసీల కొరకు ఆనాడే చేయబడ్డాయని ప్రస్తుత పాలకులు వాటిని నీరుగారుస్తూ పటిష్టంగా అమలు చేయకుండా ఇప్పుడిప్పుడే ఉన్నత చదువుల్లోకి ఆదివాసీలు అడుగు పెడుతున్న సమయంలో ఈ విధంగా కోర్టుల ద్వారా జీవోలను రద్దు చేయించి ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్ధకంగా ప్రభుత్వాలు మారుస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మేము అధికారంలోకి వస్తే జీవోల్ని తీసుకొస్తాం పునరుద్ధరిస్తాం వాటికి చట్టాలు చేసి పటిష్టపరుస్తామని అనేక మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఆ జీవోలు చట్టాల కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకపక్క ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్న మౌనంగా ఉండడం అనేది ఆదివాసీల బతుకుల్లో చీకటిని నింపడం తప్ప మరొకటి కాదని అన్నారు. ఆదివాసీల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం ఆదివాసులకు జరిగే అన్యాయం కోసం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమని… ఇప్పటికైనా మెగాడీఎస్సీ నుంచి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టుల మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అందుకే నేడు డిఎస్సి నిరుద్యోగులు, ఆదివాసి గిరిజన ప్రజా విద్యార్థి సంఘాలన్ని ఆదివాసి స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందు కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. మే 2న మన్యం బంద్ అదేవిధంగా ఈనెల 2న రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఆదివాసీ నిరుద్యోగులకు మరియు ఉద్యోగులకు జరిగే అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మన్యం బంద్ నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక ఆదివాసి మన్యం బిడ్డ అందరూ పాల్గొని గ్రామ గ్రామాన బంధు నిర్వహించి మనకు జరిగే అన్యాయాన్ని నిరసన రూపంలో తెలియచేయాలని, ప్రతి ఒక్కరు బందులో పాల్గొని విజయవంతం చేయాలని ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ జిల్లా నాయకులు సీసం సురేష్ పూణెం ప్రదీప్ కుమార్ సిపిఎం నాయకులు సున్నం రాజులు పల్లపు వెంకట్ ఆదివాసి అడ్వకేట్ మడివి రవితేజ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు సోడా రాఘవయ్య మినప నాగేశ్వరరావు సోడా ప్రసాద్ నిరుద్యోగ అభ్యర్థులు అగరం సుబ్బలక్ష్మి ధారావత్ లావణ్య గొర్రె మేన, శేషయ్య కారం సుబ్బారావు పొడియం లక్ష్మణ్, సోడి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments