
ప్రారంభించిన నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ ..”
మహిళల ఆర్ధిక స్వావలంబనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం..”
“ప్రతి మహిళ తనలోని శక్తిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి..”
టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టు మిషన్, సర్టిఫికెట్ అందజేస్తాం
పయనించే సూర్యుడు బాపట్ల మే 2:- రిపోర్టర్ (కే శివ కృష్ణ) నగరి నియోజకవర్గం,
వడమాలపేట మండలం కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. గురువారం ఉదయం వడమాలపేట ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన “నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ కి” స్ధానిక మండల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషను శిక్షణ తరగతులను మండల నాయకులు తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సీఎం నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

