
పయనించేసూర్యుడు మే01టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
మేడే జెండాను టేకులపల్లి మండల హెడ్ కోటర్ లో కాచినపల్లి అమరవీరుల స్థూపం వద్ద. టి యు సి ఐ జెండాను. టి యు సి ఐ జిల్లా కమిటీ నాయకులు జరుపుల సుందర్ జెండాను ఎగురవేశారు. అలానే చుక్కాలబోడు క్రాస్ రోడ్ వద్ద లారీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద టీయూసీఐ జెండాను మోటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు. గుగులోతు మదర్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా టి యు సి ఐ జిల్లా నాయకులు జరుపుల. సుందర్ మాట్లాడుతూ. కార్మికులు అందరూ ఐక్యతతో ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కర్షకులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను తిప్పి కొట్టాలని. చికాగోనగరంలో జూట్ మిల్లు యాజమానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన కార్మికుల స్ఫూర్తితో కార్మికులు ముందుకు సాగాలని. వారన్నారు. ఈ కార్యక్రమంలో. టి యు సి ఐ బ్రాంచ్ కమిటీ నాయకులు. ప్రసాద్. సిపిఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు. పంతులు. లింగ. సుడిగాలి వెంకన్న. టి నరేష్. కుమార్. తదితరులు పాల్గొన్నారు