Friday, May 2, 2025
Homeఆంధ్రప్రదేశ్హైడ్రా ముసుగులో పేదలు రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం

హైడ్రా ముసుగులో పేదలు రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం

Listen to this article

పయనించే సూర్యుడు మే 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ఎఫ్ టి ఎల్ పేరుతో రైతుల పట్టా భూములను లాక్కోవడానికి’ నీ అబ్బ జాగీరా’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్
హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు అంటే ఇంత లెక్కలేని తనం ఎందుకు అంటూ నిలదీత

నల్లచెరువును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైడ్రాను తీసుకువచ్చి పేద మధ్యతరగతి ప్రజలు, రైతుల ఉసురుపోసుకుంటుందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. గురువారం కూకట్పల్లి నల్ల చెరువును బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్రావు, మాధవరం కాంతారావులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము చెరువుల అభివృద్ధికి గాని, మూసీ ప్రక్షాళనకు గాని వ్యతిరేకం కాదని, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, అలాంటి వేమి పట్టించుకోకుండా ‘తమ అబ్బ జాగీర్ ‘ అన్నట్లుగా పట్టాదారుల భూములను దౌర్జన్యంగా లాక్కుంటామంటే చూస్తూ ఉరుకునే ప్రసక్తి లేదని ఈటెల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కూకట్పల్లి నల్ల చెరువు శిఖం భూమి 7.36 ఎకరాలైతే, ఎఫ్ టి ఎల్ పరిధి మాత్రం ఇరవై రెండు ఎకరాల వ్యవసాయ పట్టాభూముల్లో విస్తరించి ఉందని పేర్కొన్నారు. వందల ఏళ్ళ క్రితం నుంచి వ్యవసాయం చేసుకుంటూ పూర్తి స్థాయి పట్టాహక్కులు కలిగిన ఉన్న రైతులతో సంప్రదించి, చట్టబద్దంగా వారికి ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఏవిధంగా, ఏ రూపంలో ఇస్తారో స్పష్టం చేయకుండా పోలీసుల పహార పెట్టి బుల్డోజర్లతో గెదెలు, ఆవుల కోసం ఏర్పాటుచేసుకున్న షెడ్లను తొలగించి మరీ బావులు తవ్వినట్లు మట్టి తీయడేమిటని ప్రశ్నించారు. హైడ్రా అధికారులను పలు మార్లు కలిసి విన్నవించినా పట్టించుకోక పోవడంతో పట్టాదారులైన రైతులు హైకోర్టును ఆశ్రయించారని, పూర్తి విచారణ జరిపిన రాష్ట అత్యున్నత న్యాయస్థానం రైతుల పట్టా భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టకూడదని, జేసీబీలు, బుల్డోజర్లతో ఎలాంటి తవ్వకాలు చేపట్టవదని, ప్రస్తుతం చేపడుతున్న పనులను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకుండా అధికారులు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో అనేక మార్లు సుప్రింకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు మొట్టికాయలు వేసినా, చివాట్లు పెట్టినా కోర్టులు అంటే లెక్కలేనట్లు వ్యవహరిస్తూ నియంతృత్వం పాలన సాగిస్తారా అని ఎంపీ ఈటెల రాజేందర్ నిలదీశారు. హైడ్రా అరాచకాలపై ప్రజలు, కోర్టులు తిరగబడే సరికి హైడ్రా అధికారులను పలు మార్లు కలిసి విన్నవించినా పట్టించుకోక పోవడంతో పట్టాదారులైన రైతులు హైకోర్టును ఆశ్రయించారని, పూర్తి విచారణ జరిపిన రాష్ట అత్యున్నత న్యాయస్థానం రైతుల పట్టా భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టకూడదని, జేసీబీలు, బుల్డోజర్లతో ఎలాంటి తవ్వకాలు చేపట్టవదని, ప్రస్తుతం చేపడుతున్న పనులను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకుండా అధికారులు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో అనేక మార్లు సుప్రింకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు మొట్టికాయలు వేసినా, చివాట్లు పెట్టినా కోర్టులంటే లెక్క లేదన్నట్లుగా వ్యవహరిస్తూ నియంతృత్వ పాలన సాగిస్తారా అని ఎంపీ ఈటల రాజేందర్ హైడ్రాచకాలపై , కోర్టులు తిరగబడే సరికి తోకముడిచి దొడ్డిదారి వ్యవహారాలు నడిపిస్తుందని, హైడ్రా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో సమాజానికి అర్థమైందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఏడాది కాలంలో పేదల ఉసురుపోసుకోవడం తప్ప హైడ్రా ఉద్దరించిందేమిటో చెప్పాలన్నారు. జనాభా గణనతోపాటు బీసీ గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. అరవై ఏళ్ళ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడైన బీసీలు గుర్తించారని అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీల ఓట్ల కోసం చెప్పి అరవై శాతం ఉన్న బీసీల జనాభాను నలబై రెండు శాతానికి తగ్గించి ఇప్పుడు ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు. ఈ సమావేశంలో నల్లచెరువుల పట్టాదారులైన రైతులతోపాటు బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల వడ్డేపల్లి రాజేశ్వర్రావు, ఇంచార్జికాంతారావు, కన్వీనర్ జి. శ్రీకర్రావు, అర్శనపల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments