
పయనించే సూర్యుడు రిపోర్టర్ జలి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 2
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లో మెగా డీఎస్సీ కాదు ఏజెన్సీ నిరుద్యోగుల దగా డీఎస్సీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసి నిరుద్యోగులకు ఎన్నికల హామీ అమలు చేపట్టే వరకు పోరాటం ఆగదని ఏజెన్సీ మన్యం బంద్ సందర్భంగా గిరిజన ఆదివాసి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు శుక్రవారం నాడు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ మన్యం బంద్ పిలుపులో భాగంగా శుక్రవారం నాడు చింతూరు మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార సముదాయాలు సంపూర్ణంగా బంధు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా చింతూరు ఆదివాసి అమరవీరుల సెంటర్ వద్ద ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు నిరుద్యోగులు రహదారిపై ఆందోళన చేపట్టడం జరిగినది ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు సీసం సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో ఆదివాసి ఓట్ల కోసం అధికారంలోకి వస్తే ఏజెన్సీ ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఆదివాసీలకు 100% రిజర్వేషన్ చట్టం చేస్తానని ఆదివాసి నిరుద్యోగులకు అండగా ఉంటానని బహిరంగంగా హామీ ఇచ్చి రాష్ట్ర లో మెగా డీఎస్సీ పేరుతో ఆదివాసి ఉద్యోగాలను గిరిజనేతరులకు కట్టబెడుతున్నారని తక్షణమే ఏజెన్సీ జిల్లాల ఉపాధ్యాయ నియమకాన్ని నిలుపుదల చేసి ఏజెన్సీ ఆదివాసుల కోసం స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు, ఆదివాసి సంఘ నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసులు హక్కులు సాధించడం ఆదివాసులందరూ రాజకీయాలకు అతీతంగా పోరాటాలను ఉదృతం చేయాలని గ్రామ గ్రామాన యువత గ్రామ పెద్దలు కదిలి వచ్చి పోరాటాన్ని నిర్వహించి 100% రిజర్వేషన్ సాధించేవరకు పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు ఈ పోరాటానికి ఆదివాసి ఉపాధ్యాయులు సంపూర్ణ మద్దతు తెలియజేసినారు సిపిఎం పార్టీ చింతూరు మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు రాజ్యాంగబద్ధంగా హక్కులు 90% ఆదివాసీల్లో ఉన్న ప్రాంతంలో వారికి అన్యాయం జరిగే చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తక్షణమే ఉద్యోగ నియమకంపై ఆదివాసులకు స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలని వారి చేసే పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో పేగా ఎంపీటీసీ సున్నం నాగరాజు, గిరిజన సంఘం నాయకులు కారం సుబ్బారావు, పాండు నాగార్జున, పోడియం లక్ష్మణ్, ఉద్యోగ సంఘాల నాయకులు పండా కృష్ణయ్య, బొగ్గా ముత్తయ్య, తుర్రం వెంకటయ్య, రవి, ఆదివాసి సంఘాల నాయకులు పోడియం లక్ష్మణ్ సోడే, ప్రసాద్, సోడి శేషు, పాండు సుబ్బారావు, కారం సుందరయ్య, తుర్రం రామకోటి తదితరులు పాల్గొన్నారు,