
పయనించే సూర్యుడు మే02 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శుక్రవారం నాడు ఐటీడీఏ గురుకులం ఆర్ సి ఓ గా శ్రీమతి అరుణకుమారి బాధ్యతలు స్వీకరించారు.ఐటీడీఏ కార్యాలయంలో గురుకులం ఆర్ సి ఓ గా పనిచేసిన నాగార్జున రావు మేడ్చల్ రంగారెడ్డి ఆర్ సి ఓ గా ఈరోజు విధుల నుండి విడుదలై అరుణ కుమారికి బాధ్యతలు అప్పగించారు. ఐటీడీఏ భద్రాచలం గురుకులం ఆర్సిఓగా బాధ్యతలు స్వీకరించిన అరుణకుమారి, బదిలీ అయిన ఆర్ సి ఓ నాగార్జున రావు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మరియు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజును తమ ఛాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పిఓ మరియు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ వారిని అభినందించారు.