Monday, May 5, 2025
Homeఆంధ్రప్రదేశ్పోగొట్టుకున్న నగదును బాధితునికి అందజేస్తున్న ఎస్సై…

పోగొట్టుకున్న నగదును బాధితునికి అందజేస్తున్న ఎస్సై…

Listen to this article

నగదును అందజేస్తున్న ఎస్సై పి.సాయన్న

రుద్రూర్, మే 05 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

చింతల ముత్యాలు, తండ్రి పేరు లక్ష్మయ్య దండుపల్లి గ్రామం, మజీద్ పల్లి వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లాకి చెందిన అను వ్యక్తి తేది: 15.04.2025 రోజున తన గూగుల్ పే నుండి ఒక నెంబర్ తప్పుగా కొట్టడంతో ఆ డబ్బులు రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నర్సింలు అనే వ్యక్తికి పదివేల రూపాయలు పంపడం జరిగింది. తరువాత లక్ష్మయ్య సోమవారం రోజున పోలీస్ స్టేషన్ లో సంప్రదించగా, రుద్రూర్ ఎస్సై పి.సాయన్న ఆ వ్యక్తిని పిలిపించి అతని డబ్బులు 10 వేల రూపాయలు తిరిగి అందజేశారు. దీంతో లక్ష్మయ్య ఎస్సై పి.సాయన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments