
అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన
పయనించే సూర్యుడు మే05 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు…. . జూలూరుపాడు మండలం కాకర్ల రెవెన్యూ గ్రామంలో నివాసం ఉంటున్న వంగవీటి ప్రేమ కన్యాకుమారి సర్వేనెంబర్ 115/ఓ 1 లో ఎకరం ఆరుకుంటల భూమి కి డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్నానని, సదరు భూమిపై అన్ని హక్కులు ఉన్నప్పటికీ పూణెం సూరయ్య s/o ముత్తయ్య అను వ్యక్తి తన అనుచరులతో మా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా 2021 అవసరంలో పోలీసుల రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించగా భద్రాచలం మొబైల్ కోర్టు మరియు హైకోర్టు వారు తమకు అనుకూలంగా తరువులు జారీ చేసినప్పటికీ సదరు వ్యక్తి తన అనుచరులతో వ్యవసాయ పనులు చేస్తున్న మనుమడు చెక్కి లాల సందీప్ మరియు కూలీలను కర్రలతో కొట్టి దౌర్జన్యంగా బయటకు వెళ్లగొట్టారని కావున సదరు వ్యక్తిపై చట్టపర్తి చర్యలు తీసుకొని న్యాయం చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఆర్డీవో మధుకు ఎండార్స్ చేశారు. . సుజాతనగర్ మండలం సర్వారం కోయగూడెంలో నివాసం ఉంటున్న జరుపుల లక్ష్మణ్ s/o దేర్లా కు లక్ష్మీదేవి పల్లి మండలం కారుకొండ పరిధిలో ఉన్న వ్యవసాయ భూముల 2006వ సంవత్సరంలో ప్రభుత్వం వారు దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్ట్ కొరకు పెద్ద సైజు కాలువ తన పొలం గుండా త్రవ్వేరని దానికి దాదాపు నాలుగు ఎకరాల భూమి కోల్పోయానని, కానీ కాలువలో నీళ్లు రానందున కాలువ పూడ్చాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు మరియు మట్టి అవసరం ఉన్నందున ప్రభుత్వం వారు నా భూమిలో ఉన్న కాలువను పూడ్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం సుజాతనగర్ తాసిల్దార్ కు ఎండార్స్ చేయడం జరిగింది.. ఇల్లందు మండలం పూబెల్లి గ్రామంలో నివాసం ఉంటున్న రైతులు తాము వ్యవసాయం వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా వ్యవసాయ భూముల్లో బోర్ వేసుకున్నాం కానీ విద్యుత్ సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని, కావున ఆర్థికంగా వెనకబడినటువంటి గిరిజనులు వ్యవసాయం చేయుటకు ఉచిత విద్యుత్ మంజూరు చేయించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం విద్యుత్ శాఖ ఈ ఈ కి ఎండార్స్ చేయడం జరిగింది.. పాత పాల్వంచ శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్న ఎండి షాకిర బేగం తాను ఒంటరి మహిళలని ఎటువంటి ఆధారం లేని తాను ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నానని, తనకి అన్ని అర్హతలు ఉన్నాయని కావున మైనార్టీ శాఖ ద్వారా రాజీవ్ యువ వికాసం రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేయడం జరిగింది.. పినపాక మండలం ఎల్లాపురం గ్రామం లో నివాసం ఉంటున్న చర్ప చిన్న లక్ష్మి w/o మల్లయ్య తమకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాగలిగిన 4 ఎకరాల 20 సెంట్లు భూమి ఉన్నదని, భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఇట్టి భూమి పై తెలంగాణ ప్రభుత్వం వారు ఇస్తున్న రైతుబంధు, రైతు రుణమాఫీ తమకు ఇప్పటివరకు మంజూరు అవలేదని కావున తమకు రైతుబంధు మరియు రైతు రుణమాఫీ మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఎండార్స్ చేయడం జరిగింది. భద్రాచలం, సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న గండేపల్లి రామకృష్ణ s/o చక్రం గత 20 సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నామని, వికలాంగుడు అయిన తను ఇటువంటి పని చేయలేకపోతున్నాను అని కావున తనకు దివ్యాంగుల కోటాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పిడి హౌసింగ్ కు ఎండార్స్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.