
పయనించే సూర్యుడు మే 5 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల వెలుగు కార్యాలయంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ .వేలూరు కేశవ చౌదరి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రావి .లక్ష్మి నరసారెడ్డి మాజీ సర్పంచ్, చేజర్ల గ్రామపంచాయతీ , తహశీల్దారు మురళి యం.పి.డి.ఓ . విజయ లలిత .డిప్యూటీ యం.పి.డి.ఓ , ఐ.కె.పి, ఎ.పి.యం. సృజన. చేజర్ల మండలములోని కుట్టు మిషన్ శిక్షణ తీసుకొనే మహిళలు పోల్గోనినారు.ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని తెలియజేసియున్నారు. కుట్టు మిషన్ శిక్షణకు హాజరైన మహిళలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి . మండల సీనియర్ టి.డి.పి నాయకులు తాళ్ళూరు గిరినాయుడు లకు
సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి చేజర్ల గ్రామ మాజీ సర్పంచ్, రావి లక్ష్మి నరసారెడ్డి కి ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రత్యేక అవకాశానికి మహిళలు సంతోషంతో ధన్యవాదములు తెలియజేసుకొన్నారు.
