
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్
ఆందోళనలో డిగ్రీ కళాశాల యజమాన్యాలు రియంబర్స్మెంట్ రాకపోవడంతో నిరాశ
రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలలో డిగ్రీ పరీక్షలు వాయిదా వేసిన వాటిని తక్షణమే రీ షెడ్యూలు ప్రకటించి పరీక్షలు నిర్వహించాలి
(పయనించే సూర్యుడు మే 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అని వారు అన్నారు
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఫీజులు చెల్లించలేనిదే పరీక్షలు నిర్వహించమని ప్రైవేటు కాలేజీల యజమాన్యం చెప్పడంతో యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ రెండు మూడు సార్లు పరీక్షలు వాయిదా పడ్డాయని, ప్రైవేటు కాలేజీల యజమాన్యంతో యూనివర్సిటీ అధికారులు చర్చలు జరిపి డిగ్రీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని, ఇప్పటికే విద్యా సంవత్సరం ముగిసిందని పరీక్షలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఎలా ఉన్నత చదువులకు వెళ్లడం పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం అవుతుందని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కాలేజీల యజమాన్యం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పట్టింపులకు పోకుండా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ పరీక్షలు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్వహించాలని లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు..