
పది ఎకరాలకు ఒక ఫామ్ పౌండ్ తప్పనిసరి..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా త్వరితగతిన రూపొందించాలి…
టెలి కాన్ఫరెన్స్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పయనించే సూర్యుడు మే 06 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో ఇంకుడు గుంతల నిర్మాణాలు వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో పురోగతిలో ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణం, పామ్ పౌండ్స్ నిర్మాణాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా ల పై అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తాసిల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు మరియు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర అన్ని కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మాణాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రతి ఎకరానికి ఐదు ఇంకుడు గుంతలు అర ఎకరానికి మూడు ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైతే వర్షం నీరు నిలువ ఉంటాయో గుర్తించి అటువంటి చోట ఎక్కువ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతల నిర్మాణాలు ఉండాలన్నారు. అయినా ఇంకుడు గుంతల నిర్మాణాలను లను పంచాయతీ సెక్రటరీలు జల్ సెంచెయ్ జెన్ భాగీ దారి పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. జెల్ సoచెయ్ జన్ భాగీదారి లో దేశంలోనే మొదటి స్థానంలో జిల్లాను నిలపాలని అధికారులు ఆదేశించారు.వచ్చేవారం నుండి వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని వ్యవసాయానికి యోగ్యమైన భూముల్లో నీటి కుంటల నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడున్నర లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నదని దానిలో పదో వంతు 34 వేల నీటి కుంటలు త్రవ్వకాలు చేపట్టాలని, 10 ఎకరాలకు ఒక నీటి కుంట తప్పనిసరిగా ఉండాల్సిందే అని కలెక్టర్ చెప్పారు. ఉపాధి హామీ సిబ్బంది మరియు వ్యవసాయ అధికారులు సమన్వయంతో నీటికుంటలకు మార్కింగ్ పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా నీటి కుంటల నిర్మాణం చేపడతామని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా నీటి కుంటల ఆవశ్యకత పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీటి గుంటలో నిర్మించడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని చేపల పెంపకం చేపట్టవచ్చని తెలియజేయాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా మునగ సాగు గురించి అవగాహన కల్పించాలన్నారు. మునగ సాగు చేసి విజయం సాధించిన రైతుల గురించి చెప్పాలన్నారు.జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా రూపకల్పన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంతకం చేసిన జాబితాను ప్రతిరోజు వార్డు, గ్రామ మరియు మండల స్థాయి నివేదికలను అందించాలన్నారు. పూర్తి అయిన జాబితాలను ఇన్చార్జి మంత్రి అనుమతి కొరకు ప్రతిరోజు పంపించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.