Wednesday, May 7, 2025
Homeతెలంగాణఅక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తించి వెళ్లగొట్టాలి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తించి వెళ్లగొట్టాలి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

Listen to this article

డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు మే 6 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య : భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీలను గుర్తించి వెంటనే వారిని వారి దేశానికి పంపించాలని డిమాండ్ చేస్తూ కొందరు తెలంగాణలో మేస్త్రి ముసుగులో ఇతర రాష్ట్రాల నుంచి పని ముసుగులో గుంపులు గుంపులుగా దించుతున్నారు వారిని కూడా ఐడెంటి చేయాలి ప్రస్తుత పరిస్థితిలో ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదు . మండలంలో చాలా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండలం డిప్యూటీ తాసిల్దార్ పార్థసారధికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ పహాల్గామ సంఘటన తర్వాత దేశ రక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీలను వారి దేశం వెళ్లాల్సిందిగా గడువు విధించినప్పటికీ కొంతమంది ఇక్కడే ఉన్నారని అలాంటి వారిని గుర్తించి వెంటనే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కావాలని కొంతమంది తప్పుడు పత్రాల సృష్టించుకుని దేశంలో అలజడలు సృష్టించేందుకు ఇక్కడే ముఖం వేశారని భవిష్యత్తులో పహాల్గం సంఘటనలు పున రవృతం కాకుండా ఉండాలంటే దేశంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉండాలంటే అలాంటి వారిని గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండుకొమరయ్య. దాసరపు నరేందర్. కొయ్యడ అశోక్. పెసర వీర అర్జున్. పడాల వెంకటలక్ష్మి. రాస మల్ల శ్రీనివాస్. కొయ్యడ కుమార్ యాదవ్. చర్ల శ్రీనివాస్. కనకం సాగర్. బిజిలి సారయ్య. దాసరి సంపత్. రాజిరెడ్డి. పోతునూరి రాజు. వడ్లకొండ రాజేందర్ బొజ్జ సాయి ప్రకాష్. గొల్లపల్లి శ్రీనివాస్. బూతు అధ్యక్షులు దాసరపు తిరుపతి. రాజయ్య. వికాస్. రమేష్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments