
అన్నమయ్య జిల్లా మే 8 టీ సుండుపల్లి మండలం పయనించే సూర్యుడు
కువైట్ ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘన నివాళులు
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి గా రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నాయకుడు రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు అని సుండుపల్లి మండలంలోని ముడంపాడు కందుల వాళ్ళ పల్లికి చెందిన కువైట్ ఎన్నారై టిడిపి యువ నాయకులు కంచన రెడ్డి శేఖర్ అన్నారు. బుధవారం కువైట్ నగరంలోని హవల్లి ప్రాంతంలో ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ సుగవాసి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరగని మహోన్నత నాయకుడు సుగవాసి అన్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో మచ్చలేని నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రాజంపేట, రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రత్యేక బాటలు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశారన్నారు. అంతేకాకుండా సుగవాసి పాలకొండ్రాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అన్నారు. పసుపు జెండాను చేతపట్టి రాయచోటిలో చరిత్ర తెలుగు రాసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అటువంటి మహానాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టిడిపి నాయకులు కంచన రెడ్డి శేఖర్, సహదేవా, నాగేష్, సాయిబాబా,బలిజపల్లి సేవ సంఘం అధ్యక్షులు రాజా,కొండమర్రి శ్రీహరి నాయుడు,గోళ్ల గురుమూర్తి నాయుడు , కుంపటి నాగరాజ,మల్లికార్జున,బలరాం,మధుసూదన్,సైద్ వసి, సుబ్బ రాయుడు తదితరులు పాల్గొన్నారు.