
పయనించే సూర్యుడు// న్యూస్ మే12// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
నారాయణపేట జిల్లా క్రిష్ణ మండలం కున్సీ గ్రామ పంచాయతీ పరిధిలోని దళిత వాడలో Sc సబ్ ప్లాన్ నిధుల ద్వారా 13 లక్షల వ్యయంతో మంజూరు అయిన 200 మీటర్ల డ్రైనేజీ, మరియు 180 మీటర్ల సీసీ రోడ్డు పనులను భూమి పూజి చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంచందర్,రాజప్ప గౌడ్, సోంశేఖర్ గౌడ్, నల్లే నర్సప్ప,రాంచందర్ మాస్టర్, సిద్దప్ప మాస్టర్, టీ సుదర్శన్,పల్లె సురేష్, శరణప్పగౌడ, బి నర్సప్ప, పిట్టల ప్రభు, చంద్రశేఖర్, రాము, తదితరులు పాల్గొన్నారు.