
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు గిరిజన నిర్వాసితుల విన్నపం
పయనించే సూర్యుడుమే 12 (పొనకంటి ఉపేందర్ రావు)
: టేకులపల్లి కోయగూడెం ఓసీ 2 ఫిట్ 2, 3 లో సాగు భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు గౌరవ హైకోర్టు తీర్పు ప్రకారం భూమి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేవోసీ పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని పత్రికా ముఖంగా కోరారు,2007 సంవత్సరం లో కోయగూడెం ఓసీ 2 ఫిట్ 2, 3 కోసం గిరిజనుల సాగు లో ఉన్న పోడు భూములను ఎటువంటి నష్టపరిహారం, పునరావాసం చెల్లించకుండా తీసుకున్నారని తెలిపారు, కానీ అప్పటికే అటవీ హక్కుల చట్టం 2006అమలులోకి రావటం వల్ల గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములు సర్వే నిర్వహించారు, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమందికి హక్కు పత్రాలు కూడా ఇచ్చారు,2008సం,, లో గిరిజన నిర్వాసితులు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 2011 సంవత్సరం నవంబర్ 27న అటవీ హక్కుల చట్టం ప్రకారం కోయగూడెం ఓసీ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు భూమి పై హక్కులను గుర్తించి న్యాయం చేయాలని ఆదేశించింది, కానీ అధికారులు జీవో నెంబర్ 68ప్రకారం భూమి కోల్పోయిన నిర్వాసితులకు (ఆర్&ఆర్) కల్పిస్తామని తెలిపారు,కానీ రిహాబిలిటేషన్ క్రింద కొంత పునరావాసం కల్పించారు, రీ సెటిల్మెంట్ క్రింద భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆపివేశారని అన్నారు, దీంతో భూమి నష్టపరిహారం కోసం 2016 సంవత్సరంలో మళ్ళీ హైకోర్టు లో కేసు వేశారు,2024సంవత్సరం నవంబర్ నెలలో లో గౌరవ హైకోర్టు నిర్వాసితులకు నాలుగు వారాల్లో న్యాయం చేయాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు,కానీ ఆరు నెలలు గడుస్తున్నా గౌరవ హైకోర్టు తీర్పు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు,ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.