
పయనిం చే సూర్యుడు 12 మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపు. . ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సమ్మెను జయప్రదం చేయాలని భీంగల్ మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయటంతో పాటు ప్రజల పైన భారాలు మోసే పద్ధతుల్లో ధరలను విపరీతంగా పెంచి అన్ని వర్గాల ప్రజల పైన ఆర్థిక భారాలు మోపుతున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న 29 చట్టాలను మార్చి నాలుగు కోట్లుగా విభజించారని వీటి మూలంగా కార్మికులు హక్కులు భరించబడతాయని వల్ల తమ హక్కుల సాధన కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వటం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఎడల భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ కు సమ్మె నోటీసును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు భీమ్గల్ అధ్యక్షులు ఓంకార్ , కార్యదర్శి నవీన్, సహాయ కార్యదర్శి విజయ, ఉపాధ్యక్షులు విశ్వనాధ్ , కోశాధికారి ప్రవీణ్ తదితరులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
