
ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్
పాల్గొన్న నాయకులు బెంది శ్రీనివాస్ రెడ్డి, ఈటె గణేష్, నరేందర్, నటరాజన్ తదితరులు
ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. గణపతి, శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయస్వామి, కాశీ విశ్వేశ్వర నందీశ్వర, నవగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ, తమ ఇష్ట దైవాన్ని పూజిస్తే మనశ్శాంతి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామంలో దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బెంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నటరాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, స్థానిక మాజీ సర్పంచ్ సాయిప్రసాద్ యాదవ్, నాయకులు వీరేశం గుప్తా, బచ్చలి నరసింహా, యాదయ్య, సంజీవయ్య, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, రామస్వామి తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
