
పయనించే సూర్యుడు మే 14 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దీనికోసం నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాస్థాయిలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జరుగుతున్న వృక్షంత్ర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశిక్షణ కేంద్రంలో సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టి విద్యను అందరికీ అందే విధంగా కృషి చేయాలన్న నాణ్యమైన విద్యను అందించడమే మార్గమని దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా వృక్షంతర శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదిలో వినియోగించడం, మౌలిక భాష మరియు గణిత అభివృద్ధి కార్యక్రమాన్ని కృత్రిమ మేధా ఆధారంగా అభివృద్ధి పరచటం, పాఠశాల విద్యలో నూతనంగా ప్రవేశపెట్టబడుతున్న కృత్రిమ మేధ పాఠ్యాంశాలను పిల్లలకు అందించడం అనే మూడు నూతన విషయాలతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని దీనిని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అందరూ అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, మౌలిక వసతులలో ఏ విధమైన అంతరాలు ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి కి తెలియజేస్తే సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేయటానికి తప్పనిసరిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులకు ఎవరూ ప్రత్యామ్నాయం కాదని ఉపాధ్యాయ సర్వశక్తిమంతులని కావున వారంతా ప్రభుత్వ విద్య పరిరక్షణకు తప్పనిసరిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ,l. నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, జిల్లా రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.