
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జి మే 15
షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలచట్టం తప్ప మరో మార్గం లేదని వెంటనే గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతానికి స్పెషల్ డిఎస్సీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి గౌరవ సలహాదార్లు కొండగొర్రి ధర్మరావు, అరిక నీలకంఠం,రాష్ట్ర వైస్ చైర్మన్లు మొడియం శ్రీనివాస్ రావు,మొట్టడం రాజబాబు,తెల్లం శేఖర్,బంగారు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి,ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ రామరావుదొర,రంపచోడవరం డివిజన్ కన్వీనర్ పి. కామరాజు జెఏసి కేంద్ర కమిటీ సభ్యుడు మడావి నెహ్రూ,రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కంగాలి శ్రీనివాస్ కోరారు. భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ లో గిరిజన సలహా మండలి ఒక రాజ్యాంగ సంస్థ.గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టిఏసీ)) మినీ అసెంబ్లీ అని,5 వ షెడ్యూల్డ్ భూభాగంలో ఆదివాసీలకు విధానపరమైన నిర్ణయాలు టిఎసి ద్వారానే తీర్మానం చేసుకుంటారని,ఆంధ్రప్రదేశ్ లో వెంటనే గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాలను స్పెషల్ డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని,గిరిజన సలహా మండలి ద్వారా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి షెడ్యూల్ ప్రాంత ఉపాధ్యాయ ఉద్యోగాలు మాత్రమే కాకుండా,28 డిపార్ట్మెంట్లలో ఉన్న అన్ని ఉద్యోగాలకు రక్షణ కల్పించవలసిన అవసరం టీఏసీ చైర్మన్ మరియు సభ్యుల ముందు ఉంది. అందుకే టిఏసి సభ్యులుగా జాతిపై స్పృహ కలిగిన రాజ్యాంగ నిపుణులైన ఆదివాసి మేధావులను గవర్నర్ ,ముఖ్యమంత్రి నియమించాలని,మంత్రి మండలి ఏర్పాటు చేసినట్లే గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ సుమారు సంవత్సరం గడుస్తున్న గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.