
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే 17
అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరులో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజు విజయవంతంగా ముగిసాయి.ఈ దీక్షలను ఉద్దేశించి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ ఏ ప్రభుత్వం వచ్చినా ఆదివాసులను మోసం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ఆదివాసీ మేలుకో నీ హక్కులను కాపాడుకో అనే నినాదంతో పటు దీక్షల నుండి కదలం హక్కులు సాధన వదలం ఆదివాసి యువతరం ముందుకెళ్లాలని అయన పిలుపునిచ్చారు.ఈరోజు దీక్షకు సీనియర్ న్యాయవాదులు ఇల్లా చిన్నారెడ్డి, ఆత్రం నవీన్ దీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ ఈ దీక్షలకు ఆదివాసి సమాజం ఆదివాసి ఉద్యోగులు ఆదివాసి యువతరం నిరుద్యోగులు మహిళలు ప్రతి ఒక్కరి మద్దతు తెలియజేయాలని లేకుంటే ఆదివాసి సమాజం మనుగడే ఉండదని, జాతి సౌలభ్యం కోసం పోరాడే జేఏసీ లాంటి పోరాట సమితికి ప్రతి ఒక్కరి మద్దతు ఉండాలని పిలుపునిచ్చారు ఈ దీక్షను స్థానిక చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సందర్శించి నా వంతుగా ట్రైబల్ వెల్ఫేర్ వారికి మీయొక్క డిమాండ్స్ ను డైరెక్టుగా తెలియజేస్తాం అన్నారు. దీనికి బదులుగా జేఏసీ నాయకులు పూర్తి ఆదేశాలు వచ్చే వరకు మేము ఈ దీక్ష విరమించబోమని చెప్పటం జరిగింది,అలాగే చిరుమూరు సర్పంచ్ కాకా అరుణ కుమారి దీక్ష శిబిరం వద్దకు వచ్చి ఆదివాసీ జేఏసీ దీక్షలకు తన వంతు పూర్తి మద్దతు ఉంటుంది అని ఆమె తెలియజేసింది ఈ కార్యక్రమం లోబీరబోయిన రామకృష్ణ, అక్కిపల్లి వీరయ్య, అభిరామ్, లక్ష్మణ్, గంగూలీ, పులి శేఖర్, పూజారి రాహుల్, ప్రవీణ్, సాగర్, దుర్గారావు, అంజి, అశోక్, వేణు, పులి కన్నారావు, మూర్రం సత్తిబాబుతదితరులు పాల్గొన్నారు.

