
పయనించే సూర్యుడు మే 20 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
తిరుపతి పట్టణంలో బీటెక్ చదువుతున్న యస్సీ కులం విద్యార్థి జేమ్స్ ను జూనియర్ విద్యార్థులు కులం పేరుతో దూషించి, ఎందుకని ప్రశ్నించినందులకు కిడ్నాప్ చేసి, రెండురోజులు పాటు చిత్రహింసలు పెట్టి చావగొట్టి, నోట్లో మూత్రం పోసిన జూనియర్ అగ్రకుల విద్యార్థులను అందుకు సహకరిస్తున్న పెద్దలు . నాయకులందరిపైన యస్సీ ,ఎస్టీ అట్రాసిటి హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని కోరుచున్నాను.మహిళలను అర్ధరాత్రి వేళ అదికూడా నైటీ డ్రస్సులోనే అరెస్టు చేస్తున్న ఆంధ్రా పోలీస్ పహిల్వాన్లు, పవిత్ర తిరుపతి పట్టణంలో జరిగిన ఈ దారుణ అమానుష ఘటనలో ఎందుకు వెనకడుగు వేస్తు, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఇందులో రాజకీయ పార్టీల నాయకుల పిల్లల ప్రమేయం ఉన్నందుకే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తూ, ఇప్పటికే మోయలేని చెడ్డపేరును మూటకట్టుకునే ఘనత వహించిన పోలీస్ పెద్దలు, ఈ యస్సీ విద్యార్థి జేమ్స్ పైన దాడికి పాల్పడిన వారిని కనీషం పగటి పూటైన అరెస్టు చేసే ధైర్యం చేస్తారని ఆశిస్తున్నాము.
రాష్ట్ర హోంమంత్రి దళిత ఆడపడుచు అనితమ్మ అతి హేయమైన ఈ సంఘటనపైన వెంటనే స్పందించి, దళిత విద్యార్థి జేమ్స్ కు బాసటగా నిలిచి, ఈ సంఘటపై సమగ్ర విచారణ జరిపి, ఈ ఘటనలో ప్రమేయమున్న అందరిపై కేసులు నమోదు చేయించాలి. తిరుపతిలో జరిగిన ఈ దారుణ సంఘటనతో పాటు, ఇంకా మన రాష్ట్రంలోని పిఠాపురం, నెల్లూరు జిల్లాలలో జరిగిన యస్సీ కులాల బహిస్కరణలు వెలివేతలు మీద కూడ రాష్ట్ర హోంమంత్రి . సనాతన సమతావాది రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి స్పందించాలి. బాధితులకు అండగ నిలబడి, దౌర్జన్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకు దిగజారిపోతున్న శాంతి భద్రతలను వెంటనే పరిరక్షించాలి.బీఎంఎస్ . భారత్ మహాసేన సేవాదళ్ అధ్యక్షులు జువ్వు గుంట బాబు సోమవారం తెలిపారు