
- ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్
- పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే 20
అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరులో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజు దీక్షలు ఎర్రం పేట పేసా కమిటీ ఉపాధ్యక్షులు కారం సాయి బాబు ప్రారంభం చేసి మాట్లాడుతూ జి ఓ no. 3 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరణ చేయాలి అయన అన్నారు విజయవంతంగా ముగిసాయి.ఈ దీక్షలను ఉద్దేశించి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ ఏ ప్రభుత్వం వచ్చినా ఆదివాసులను మోసం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ఆదివాసీ మేలుకో నీ హక్కులను కాపాడుకో అనే నినాదంతో పటు దీక్షల నుండి ఆదివాసి యువతరం ముందుకెళ్లాలని అయన పిలుపునిచ్చారు. ఈరోజు దీక్షకు మాట్లాడుతూ ఈ దీక్షలకు ఆదివాసి సమాజం ఆదివాసి ఉద్యోగులు ఆదివాసి యువతరం నిరుద్యోగులు మహిళలు ప్రతి ఒక్కరి మద్దతు తెలియజేయాలని లేకుంటే ఆదివాసి సమాజం మనుగడే ఉండదని, జాతి సౌలభ్యం కోసం పోరాడే జేఏసీ లాంటి పోరాట సమితికి ప్రతి ఒక్కరి మద్దతు ఉండాలని పిలుపునిచ్చారు ఈ దీక్షలును ఉద్దేశించి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ mla లతో ట్రైబల్ అద్వైజరి కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆదివాసీ లకు న్యాయం చేయాలి అన్నారు అలాగే ఏజెన్సీ ఉద్యోగ నియమా చట్టం ను చెయ్యాలి జేఏసీ నాయకులు పూర్తి ఆదేశాలు వచ్చే వరకు మేము ఈ దీక్ష విరమించబోమని చెప్పటం జరిగింది ఈ కార్యక్రమం కూర మహేంద్ర, పాయం అది, మడివి దేశమ్మ, మడివి మీనాక్షి, మడివి, సాయి బొడ్డు బలరాం, కంగాల ప్రవీణ్, జల్లి బిక్షం, హర్ష తదితరులు పాల్గొన్నారు.