Friday, May 23, 2025
Homeఆంధ్రప్రదేశ్చిత్తూరు పివికేఎన్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

చిత్తూరు పివికేఎన్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Listen to this article

సర్వరోగ నివారణగా యోగ….

ప్రతి ఒక్కరూ యోగా ను జీవితం లో ఓ భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలి

యోగేంద్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు ప్రతి ఒక్కరికి యోగ పై అవగాహన కల్పించడం లక్ష్యం

యోగా చేయడం ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్ గా, చురుగ్గా ఉంటూ పనిలో ఒత్తిడిలు ఉండవు.

యోగ మన జీవన సరళి లో ఒక భాగం కావాలి

చిత్తూరు శాసన సభ్యులు

మనిషి ఆరోగ్య వృద్ధి కి యోగ తప్పనిసరి.

పయనించే సూర్యుడు బాపట్లమే:- 22 రిపోర్టర్ (కే శివకృష్ణ)

యోగ సర్వరోగ నివారిణి అని, అటువంటి యోగాను జీవితంలో ఓ భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ.. యోగ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్రమైన పి వీ కె ఎన్ కళాశాల మైదానం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగా కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు,
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు,చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్,చుడా చైర్మన్ కటారి హేమలత, డిఆర్ఓ కే మోహన్ కుమార్ తదితరులు పాల్గొని, యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు కామెంట్స్…దేశం మొత్తం యోగా దినోత్సవం సుకుంటుందని, దీనికి కారణం గౌ.ప్రధానమంత్రి యోగా దినోత్సవాన్ని నిర్వహించడమే … క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం లాగానే యోగాను కూడా మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. మనిషి క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ముందు ముందు చాలా ఉపయోగాలు ఉంటాయి.ప్రతి మనిషి రోజువారి ప్రణాళికలో యోగా ను చేర్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావని, చేసే పనులు చురుగ్గా చేయగలరు. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంగా అలవర్చుకోవాలి.
జిల్లా కలెక్టర్ కామెంట్స్…ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి యోగ పై అవగాహన ఉంచేందుకు యోగంద్ర కార్యక్రమాన్ని నెల ముందే ప్రారంభం చేస్తున్నామన్నారు.ఈ యోగేంద్ర కార్యక్రమంలో గ్రామ,మండల, జిల్లాస్థాయిలో ప్రతి ఒక్కరికి యోగ పై అవగాహన కల్పించడం లక్ష్యమన్నారు.యోగ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అవగాహన కల్పించాలన్నారు.ప్రతిరోజు యోగ అలవాటు చేసుకోవడం ద్వారా ప్రతి మనిషి జీవనశైలిలో ఒత్తిడి లు వంటివి ఉండవనన్నారు.జిల్లా ఎస్పీ కామెంట్స్..ప్రధానమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ప్రతి ఒక్కరూ ఒక నెలపాటు క్రమం తప్పకుండా యోగ చేయాలని సందేశం అందించారు. పోలీసుల శిక్షణలో భాగంగా యోగా పై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.యోగా చేయడం ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్ గా, చురుగ్గా ఉంటూ పనిలో ఒత్తిడిలు ఉండవు.చిత్తూరు శాసనసభ్యుల కామెంట్స్..రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు చురుగ్గా సేవలను చేయడానికి గల కారణం యోగా.రాష్ట్రంలో విశాఖపట్నం నందు ఈ నెల 23 న ప్రధాన మంత్రి వర్యులు,రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు యోగ కార్యక్రమాన్ని నిర్వహించ బోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ప్రతిరోజు తన జీవనశైలిలో యోగా ను ఒక భాగంగా చేసుకున్నారని , ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు వోకల్ యోగ చేస్తారని తెలిపారు. చుడా చైర్ పర్సన్ కామెంట్స్…ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేస్తే వారి పని భారం, ఒత్తిడి లకు గురికాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది.మనిషి ఆరోగ్యం వృద్ధి చేసుకోవాలంటే యోగ తప్పనిసరి ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments