
పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వడ్ల శ్రీనివాస్ 23 తేదీ
తిరుమల తిరుపతి లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సంకీర్తనం లో బిజ్వార్ శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి వారు భజన చేశారు.ప్రతి సంవత్సరం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భజన చేయడం పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. భజన చేయడం వలన మనస్సుకు ప్రశాంతత,శాంతి,సంతోషం,ఆనందం కలుగుతుందని తెలిపారు.భజన మన సంస్కృతులు, సంప్రదాయాలను భవిష్యత్తు తరాల వారికి తెలుస్తాయని అన్నారు.సమాజంలో ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడుచుటకు భజన తోడ్పడుతుందని తెలిపారు.భజనల వలన దైవ భక్తి,దేశభక్తి పెంపొందుతుంది తెలిపారు.దేశంలో ప్రతి ఒక్కరు దేశం కోసం,ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేసే అలవాటు భజన ద్వారా వస్తుందని అన్నారు. భజన పరులు విశ్వకళ్యాణం కోసం అన్ని దేవుళ్లను,దేవతలను ప్రార్థిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి అధ్యక్షులు దొరోళ్ల కృష్ణయ్య,సుధాకర్ రెడ్డి,హెచ్.నర్సింహా,నాగిరెడ్డి, వెంకప్ప గౌడ్,రాజమూరి,ఆంజనేయులు, దరిమిది నర్సింహా, శివా రెడ్డి, దత్తప్ప,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
