
పయనించే సూర్యుడు మే 24 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం
సుండుపల్లె : ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రేషన్ పంపిణీ చేయాలని తహసిల్దార్ దైవాధీనం తెలిపారు. శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డోర్ డెలివరీ వాహనాలను రద్దు చేసిన కారణంగా చౌక దుకాణాల డీలర్లు అందరూ రేషన్ ఇచ్చే రోజులలో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్క డీలర్ తమ చౌక దుకాణాలలో అవకతవకలకు చోటు ఇవ్వకుండా సక్రమమైన పద్ధతి ద్వారా రేషన్ పంపిణీ చేయాలని ఆయన సూచించారు. చౌక దుకాణాలలో బినామీలు లేకుండా డీలర్లు మాత్రమే పంపిణీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ సలాం భాష, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు నాయక్, చౌక దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.