
( పయనించే సూర్యుడు మే 26 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల, కాశిరెడ్డి గూడ మరియు తిమ్మాజీ పల్లి తండా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు షాద్నగర్ ఎమ్మెల్యే , ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మరియు ఎంపీడీవో బన్సీలాల్, ఎంపిఓ జయంత్ మరియు లబ్ధిదారుల తో కలిసి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తామని నాలుగు విడతలుగా ఇందిరమ్మ ఇల్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, ఎంపిఓ జయంత్ మరియు బూర్గుల గ్రామపంచాయతీ కార్యదర్శి సరోజ, కడియాల కుంట తండా గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య, కాంగ్రెస్ పార్టీ ఫరూక్నగర్ మండల అధ్యక్షులు చల్ల శ్రీకాంత్ రెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జిరాజు నాయక్, మాజీ వార్డ్ నెంబర్ హనుమంతు, రమేష్ నాయక్ మరియు గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు.

