
పయనించే సూర్యుడు మే 26 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మినిస్టరీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ( MORD) కేంద్ర బృందం సభ్యులు రాకేష్ కుమార్ అండర్ సెక్రటరీ ( బడ్జెట్) మరియు అమిత్ కుమార్ సెక్షన్ ఆఫీసర్ జిల్లాలోని చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. నాలుగు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మొదటిరోజు బృంద సభ్యులు జిల్లా కలెక్టర్ జితేష్ వి పార్టీలను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు పథకాలను బృంద సభ్యులకు వివరించారు. అనంతరం ఐ డి ఓ సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రమును బృంద సభ్యులు పరిశీలించారు. డి ఆర్ డి ఏ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చండుగొండ మండలం తిప్పనపల్లి మరియు రావికంపాడు గ్రామాలలో బృంద సభ్యులు విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తిప్పనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి ఉపాధి హామీ పథకం వేతన దారులు, స్వయం సహాయక సంఘ మహిళలు మరియు ఎన్ ఎస్ ఏ పి పెన్షనర్లతో ముచ్చటించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇంట్లో పి ఎం ఎఫ్ ఎం ఈ పథకం కింద ఏర్పాటుచేసిన ఊరగాయ తయారీ యూనిట్ను పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీ, అవెన్యూ తోటలు మరియు ప్రాథమిక పాఠశాలలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన కిషన్ షెడ్ పనులను మరియు పౌల్ట్రీ షెడ్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రావికంపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద మునగ తోటల పెంపకం, పశువుల షెడ్, బృహత్ పల్లె ప్రకృతి వనాలు మరియు నర్సరీ, కొబ్బరి గట్టు తోటల పెంపకం ను పరిశీలించి తగు సూచనలు చేశారు