Thursday, May 29, 2025
Homeఆంధ్రప్రదేశ్గిరిజన మహిళా సమాఖ్యల ద్వారా ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలి. మైనింగ్ శాఖ...

గిరిజన మహిళా సమాఖ్యల ద్వారా ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలి. మైనింగ్ శాఖ ఎండి భవేష్ మిశ్రా ఐ ఏ ఎస్.

Listen to this article

పయనించే సూర్యుడు మే 27 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీసా యాక్ట్ ప్రకారం మహిళా సమాఖ్య ల ద్వారా ఇసుక ర్యాంపుల ఏర్పాటు మరియు నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని మైనింగ్ శాఖ ఎండి భవిష్య మిశ్రా ఐ ఏ ఎస్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో గిరిజన సమైక్యల ద్వారా ఇసుక ర్యాపుల ఏర్పాటు మరియు నిర్వహణ కు తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐ టిడిఏ పి. ఓ రాహుల్ మరియు ములుగు ఐటీడీఏ పీవో చిత్ర మిశ్ర తో కలిసి టిజీ ఎం డి సి, ఐ టి డి ఏ మరియు మైనింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లాలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల వివరాలు మరియు ప్రస్తుతం ఇసుక రాంపుల నిర్వహణలో చేపడుతున్న పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మైనింగ్ శాఖ ఎండికి వివరించారు. అనంతరం మైనింగ్ శాఖ ఎండి భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపుల నిర్వహణ చేపట్టడం ద్వారా గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి జీవ నోపాధి పెంపొందించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. గిరిజన మహిళా సంఘాల ద్వారా ఇసుక ర్యాంపుల నిర్వహణ కు ఐటిడిఎ ద్వారా అవసరమైన వాహనాలు మరియు యంత్ర పరికరాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. దీని ద్వారా గిరిజన మహిళా సమాఖ్యలకు మూడు రెట్ల అధిక ఆదాయం సమకూర్తుందన్నారు. ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఏజెన్సీ ప్రాంతమైన గిరిజనులకు ఐటీడీఏ మరియు మైనింగ్ శాఖ అధికారులు సరైన అవగాహన కల్పించాలన్నారు. ఏర్పాటు చేసే ప్రతి ఇసుక రాంపులలో మహిళా సమాఖ్యలకు తోడ్పాటున అందించే విధంగా ఐటిడిఏ నుండి ఒక అధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మరియు ములుగు జిల్లాలో మూడు ఇసుక ర్యాంపులు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వారాల్లో ఇసుక ర్యాంపులకు ఏర్పాటుకు ఉత్సాహవంతులైన మహిళా సమాఖ్య సభ్యులను గుర్తించాలన్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక ఇసుక ర్యాంపును ప్రారంభించే విధంగా వారికి శిక్షణ అందించాలని సూచించారు. గిరిజన మహిళలు సమర్థవంతంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ చేయడానికి అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ శంకర్ నాయక్, ఏడి మైన్స్ దినేష్ కుమార్ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments