
( పయనించే సూర్యుడు జూన్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
భారతదేశం లోనే ప్రసిద్ధి చెందిన ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజషన్ అఫ్ ఇండియా లో సభ్యత్వం పొందిన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్. హైదరాబాద్ లో జరిగిన ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజషన్ అఫ్ ఇండియా ఆల్ మాస్టర్స్ జనరల్ బాడీ మీటింగ్ లో షాద్ నగర్ లో తన మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫు తో ఎంతోమంది చిన్నారులు, పెద్దలను కుంగ్ ఫు లో నైపుణ్యం, అవగాహన కల్పిస్తున్న న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ ను ఆర్గనైజషన్ లో మెంబెర్ షిప్ అందచేశారు.అదేవిదంగా షాద్ నగర్ పట్టణ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజషన్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు బాధ్యతలు అప్పగించిన ఆర్గనైజషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
