
పయనించే సూర్యుడు జూన్ 17 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్రం లోని రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయంకింద రైతు భరోసా పథకం ద్వారా పూర్తి స్థాయిలో సాగు చేసేటటువంటి ప్రతీ ఎకరాకు 6000 /- ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసి రైతన్న లకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతున్నలు, పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ మాట్లాడుతూ.వానకాలం పంట పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసేటటువంటి ప్రతి ఒక్క ఎకరాకు రైతు భరోసా అందించి రైతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తునరాని, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నపటికీ ప్రభుత్వం పథకాలను అమలు చేయటంలో వెనకడుగు వేయకుండా ప్రజా పరిపాలన అందిస్తుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కార్యకర్తలు కృషి చేయాలనీ నాయకులు ప్రజల మద్యల్లో ఉండి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా పని చేయాలనీ వారు కోరారు.ఈ కార్యక్రమంలో
మండల అధ్యక్షులు దేవా నాయక్, ఈది గణేష్, పోశాలు, రెడ్యానాయక్, బండ్ల రజినీ,సరోజిని,సరిత,రజియా,భద్రు,లక్కినేని శ్యామ్,శంకర్,మధు రెడ్డి,వీరభద్రం,సర్దార్,చందర్ సింగ్,శివ, బొడ్డు అశోక్,రాసమళ్ళ నర్సయ్య, అఫ్రోజ్, నవీన్,బన్సీ లాల్, కోటి,చెన్నయ్య, పూన్య నాయక్,ఊకె నరేందర్,ఊకె రామకృష్ణ, సత్యం, విజయ్,సంజయ్,బానోత్ రవి,ఈశ్వర్,ఇస్లావత్ గణేష్, నగేష్,ధర్మయ్య గౌడ్, బానోత్ శంకర్,హనుమంతు, గోవర్దన్, జింకల రాజు,వెంకటి,శివాజీ,శేఖర్, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.