
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 26
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం,చట్టి గ్రామపంచాయతీ చట్టి గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను 15 మీటర్లు 45 అడుగులు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారం రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేసింది. కానీ చట్టి గ్రామంలో మార్కింగ్ లేక ఎన్ని మీటర్ల తొలగించాలో తెలియక కొంతవరకు (మూడు అడుగులు ఐదు అడుగులు) వరకు తీసి ఇంకా కొంతమంది షాపులు తొలగించలేక అయోమయ స్థితిలో ఉన్నాము. ఇప్పటికైనా తమరి ఆదేశాలతో మార్కింగ్ ఏర్పాటు చేసి అక్రమ తొలగింపు చర్యలు చేపట్టాలని చట్టి గ్రామ ” పెసా ” కమిటీ సభ్యులు అధ్యక్షులు తుర్రం. చిన ముత్తయ్య, కార్యదర్శి,పొడియం.రామకృష్ణ గ్రామస్తులు రవ్వ ప్రసాద్,తుర్రం.నీలా రాజు,సవలం.రమేష్ తదితరులు కలిసి స్థానిక ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.