
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల్
ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
భీమ్ గల్ లోని అన్ని గ్రామాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది..
ప్రతి శుక్రవారం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీలు వివో అధ్యక్షులు వివోఏ గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తూ ఇండ్లలో నిలువ ఉన్న నీటిని పారబోయించడం జరిగింది.. ముఖ్యంగా ఇంటి ఆవరణలో గల కుండీలు పాత టైర్లు కుండలు అదేవిధంగా కూలర్లలో నిలువ ఉన్న నీటిని ఇంటి యజమానులకు తెలిపి తొలగించడం జరిగింది గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రోడ్ వెంబడి పిచ్చి మొక్కలు తొలగిస్తూ మురికి కాలువలలో ఆంటీ లార్వాస్పై బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

