
మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ..
//పయనించే సూర్యుడు// జులై 2//మక్తల్
మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో. ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ పాడి ,పశుసంవర్ధక, డెయిరీ , క్రీడా, యువజన శాఖామంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశం మేరకు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మంగళవారం. రోజు గ్రామంలో లబ్ధిదారులకు అధికారులచే మరియు.ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల స్థలాలలో ముగ్గు వేసి . ప్రారంభించడం అయినది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ. గత పదేళ్లుగా తమకు ఎలాంటి ఇల్లు మంజూరు కాలేదు . గతంలో ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ హయాంలో ఇచ్చారని.. తిరిగి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పశుసంవర్ధక పాడి క్రీడా యోజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినందుకు జీవితాంతం తామ రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో . హౌసింగ్ ఏఈ అంజప్ప. పంచాయతీ సెక్రటరీ రాజేష్. మక్తల్ మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్.మరియు.ఇందిరమ్మ కమిటీ సభ్యులు. గ్రామ ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
