
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 2 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్లోని ఆదివాసి జేఏసీ పాత్రికేయ సమావేశంలో ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ చింతూరు ఐటీడీఏ పీవో మరియు చింతూరు ఎమ్మార్వో ఒరిస్సా రాష్ట్రము నుంచి వలస వచ్చివారు తాము ఎస్టి ఫోర్జ లమని, మాకు ఎస్టి ధ్రువపత్రాలు ఇవ్వాలని వలసవాదులు కలిసి రాజకీయం చేస్తుంటే వాళ్లకు మాత్రం తక్షణమే ఎస్టి కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నారని అన్నారు. దాని వలన స్థానిక ఆదివాసీలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు పొర్జా లు వాస్తవానికి ఒరిస్సా రాష్ట్రంలో ఎస్టి లే కానీ మోతుగూడెం , గొడ్లగూడెం ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళు నిజమైన ఎస్టి పార్జా తెగలు కాదని అధికారుల గుర్తించాలని వాళ్ల దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో తెలపాలన్నారు. రెవిన్యూ అధికారులకు తప్పుడు ధృవపత్రాలు చూపిస్తూ, రాజకీయ పార్టీల సహకారంతో నకిలీ ఎస్టి కి దృవపత్రాలు ఇస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రము నుండి వచ్చి తాము ఎస్టీలమే అంటే వెంటనే వాళ్ళకి ధ్రువపత్రాలు ఇవ్వటానికి అధికారులకు ఎందుకంత ఉత్సాహం అర్థం కావట్లేదు అన్నారు. అధికారులు వాళ్లకి ఎస్టీ దృపత్రాలు ఇవ్వాలని చూడటం సరికాదని అన్నారు. అలా ఇచ్చినట్లయితే న్యాయస్థానం మెట్లు అధికారులు ఎక్కక తప్పదు ఈ ఆలోచనను విరమించుకోకపోతే ఎస్టీ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలా చెప్తామని హెచ్చరించారు అవసరమైతే తాసిల్దార్ కార్యాలయాలు మరియు ఐటిడిఏ ను వేలాది మంది ఆదివాసీలతో ముట్టడిస్తామని హెచ్చరించారు