
వ్యాపార సముదాలను తనిఖీ చేసిన లేబర్ అధికారులు..
రుద్రూర్, జూలై 04 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలో లేబర్ అధికారి నరేందర్ రాజ్, పోలీసు బృందం ఎస్సై పీటర్, చైల్డ్ హెల్ప్ లైన్, ఎన్జీవో సమన్వయ కర్తల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మెకానిక్ షాపులు, దుకాణ సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. బాల కార్మికుల సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం అనేక చట్టాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ బృందం, పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు.