
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి
డాక్టర్ దేవేందర్ పిల్లల వైద్య నిపుణులు
పయనించే సూర్యుడు జులై07 (పొనకంటి ఉపేందర్ రావు )
ఆదివారం టేకులపల్లి మండలం టేకులపల్లి ప్రైమరీ స్కూల్ నందు హెల్త్ క్యాంప్ జనని హాస్పిటల్ ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ వి.దేవేందర్ , ఎండి పీడియాట్రిక్స్. సునీత ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు హెల్త్ చెకప్ చిన్నపిల్లలకు ఉచిత వైద్య సేవలు అందించారు, ఈ ఉచిత వైద్య శిబిరంలో 50 మంది పైగాచిన్న పిల్లలకు చెకప్ లు నిర్వహించి మందులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ సీజన్ వ్యాధుల పట్ల వెంటనే అప్రమతమై పిల్లల వైద్యుని సంప్రదించాలని చిన్నపిల్లల్లో వచ్చు మలేరియా డెంగు టైఫాయిడ్ వంటి విష జ్వరాలు మూడు రోజులు సాధారణంగా తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే మొదటి దశలో అతి తక్కువ ఖర్చుతోనే వైద్యం చేయొచ్చు అని అన్నారు జనని చిల్డ్రన్స్ హాస్పటల్ నందు ఉచిత ఆరోగ్యశ్రీ సౌకర్యం కలదు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు వైద్యం అందించబడుతుంది. కావున ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగపర్చుకోవాలనీ డాక్టర్ దేవేందర్, సునీత తెలిపారు.