
పయనించే సూర్యుడు జూలై 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎం పి టి ఎం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ ఎస్.కె మెహతాబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె లక్ష్మీ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలని అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని, ప్రతినిత్యం మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ ఎస్.కె మెహతాబ్ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్ , హిమోగ్లోబిన్ పెంపొందించుకోవడానికి ప్రతినిత్యం ఆకు కూరలు, గుడ్లు, మాంసంతో కూడిన మంచి ఆహారం తీసుకోవాలని తద్వారా శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా పెంపొందుతుందని ఆమె సూచించారు. సిహెచ్ఒ. వెంగయ్య మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు ప్రతిరోజు వ్యాయామం చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని తద్వారా మీరు చదువులో మంచి ఏకాగ్రత చూపగలరని సూచించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు బిపి, షుగర్, హెమోగ్లోబిన్ పర్సంటేజ్, బరువు, ఎత్తు మొదలగునవి పరీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు లక్ష్మీనారాయణమ్మ, అరుణ మస్తానమ్మ ఆశ వర్కర్లు పవిత్ర కుమారి, పద్మ, పెంచలమ్మ వెంకటలక్ష్మి మొదలగు వారు, అధ్యాపకులు శ్రీధర్ మల్లేశ్వరరావు, సందాని భాషా సురేష్,యల్లయ్య, సుబ్బారావు, కామాక్షమ్మ, నాగమల్లేశ్వరమ్మ .సాలమ్మ తదితరులు పాల్గొన్నారు. పై కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది