
పయనించే సూర్యుడు గాంధారి 08/07/25
పీఎం శ్రీ ఉన్నత పాఠశాల గాంధారి లో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన సదస్సును నిర్వహించారు.పర్యవరణ సమస్యలు,సుస్థిర వ్యవసాయం జీవవైవిధ్యo అంశంపై గాంధారి ఫారెస్ట్ రేంజ్ అధికారి హిమచందన మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సహజ వనరులను సంరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడడం లాంటి చర్యలు తీసుకోవాలన్నారు. భూమిపై జీవించడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మన పర్యావరణం ఎంతో అవసరమన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.అడవుల ప్రాముక్యతను వివరించిన FRO ని శాలువా మేమోంటో తో సత్కరించారు .ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు రంగా వెంకటేశ్వర్ గౌడ్, రాజపండిట్, మల్లేష్, శంకర్ గౌడ్, బాల్ రెడ్డి, శరణ్య శ్రీదేవి,వనజ తదితరులు పాల్గొన్నారు