Tuesday, July 8, 2025
Homeఆంధ్రప్రదేశ్పెండింగ్ ఫీజురీయంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.

పెండింగ్ ఫీజురీయంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.

Listen to this article

ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు. సోడి అశోక్.

పయనించే సూర్యుడు; జులై 07: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.

నూగూరు వెంకటాపురం: ములుగు జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నూగూరు వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్.ఐ. కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్స్,స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులు, ప్రైవేటు యాజమాన్యాలు, తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోంటున్నారు. వడ్డీలు తెచ్చి మేం విద్యాసంస్థలను నడపలేము అని పరీక్షలు బాయ్ కాట్ చేశారు. ఇంకోపక్క విద్యార్థులు నుండి పెండింగ్ ఫీజులను బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదనీ వాపోయారు .కాంగ్రెస్ గత పాలకుల నిర్లక్ష్యంను విమర్శించి వారు అధికారంలోకి వస్తే ఫీజు రీయంబర్స్ మెంట్స్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని ఈ పథకాన్ని మరింత పటిష్టమైన పథకంగా రూపోందించి బకాయిలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13లక్షల మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలంటే సర్టీఫికేట్స్ కోసం కాలేజీలు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, కొన్ని కళాశాలలు కూడా ముక్కు పిండి మరి ఫీజులు వసూళ్లు చేస్తున్నారనీ తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజులను విడుదల చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చంది తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments