
పయనించే సూర్యుడు న్యూస్(జూలై.8/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
సత్యవేడు శ్రీసిటీ ద్వారా పారిశ్రామికవాడకు పునాది వేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ నూకతోటి రాజేష్ గుర్తు చేశారు.మంగళవారం పట్టణంలోని వైయస్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చంద్రశేఖర్ రెడ్డి,బిరేంద్ర వర్మ,బాలాజీ రెడ్డి,నిరంజన్ రెడ్డి,బెల్ట్ రమేష్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ వైయస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.పైగా పేద ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే మహిళలకు పావలా వడ్డీ రుణాలు,ఆరోగ్యశ్రీ,ఫీజురియంబర్స్మెంట్,జల యజ్ఞం,108,104 సేవలు ఉందన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా వైయస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్టు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నగదు బదిలీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ది చేకూర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే అమలు చేసిన పథకాలను ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ప్రచారం చేయలేకపోయామన్నారు.ఇకపై పార్టీ ఆదేనుసారం సమన్వయంతో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.అంత మునుపు నూక తోటి రాజేష్ నాయకులతో కలిసి దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణుల మధ్య కేకునుకట్ చేశారు.తదనంతరం పలువురికి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు శ్యాం ప్రసాద్, మస్తానమ్మ,ఎంపీటీసీ బాలయ్య,సర్పంచ్ శేఖర్,గోవిందస్వామి,శ్రీనివాసులు రెడ్డి, శ్రీరాములు రెడ్డి,ఎంపీ రవి,గురునాథం,శ్రీధర్ రెడ్డి,టెంకాయల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.