
పయనించే సూర్యుడు రిపోర్టర్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 8
మంగళవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం కోయఅంకంపాలెం గ్రామంలో ఆదివాసులతో నిర్వహించిన ఆదివాసి చట్టాల అవగాహన సమావేశంలో హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని దీని మూలాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు అన్ని రకాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఏజెన్సీలో 1/70 చట్టం పగడ్బందీగా అమలుకు నోచుకోక కేవలం అధికారులు తీరు వలన పేపర్ చట్టంగా మిగిలిపోతుందని దీని మూలానే మైదాన ప్రాంతాల నుంచి నాన్ ట్రైబల్స్ విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలసలు వచ్చి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా స్థిర నివాసాలు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుని ఆదివాసులకు వ్యాపార ఉపాధి ఉద్యోగ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని దీని అంతటికి కారణం ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే అని విమర్శించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు రాజ్యాంగ చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలోకి నాన్ డ్రైవర్స్ విపరీతంగా వలసలు వచ్చి ఏజెన్సీ మండల కేంద్రాలన్నీ ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలుగా మార్చుకున్నారని ఆ ప్రాంతాల్లో ఆదివాసులకు కొట్టు పెట్టుకోవడానికి కూడా జాగ దొరకటం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. 1905 లో వచ్చిన భూ ఆక్రమణ నిషేధిత చట్టం, సుప్రీంకోర్టు నిబంధన మేరకు 2011 లో అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ జీవో 188 నిబంధనల ప్రకారం భూ ఆక్రమణలు ఎక్కడ జరిగిన తక్షణమే నోటీసులు ఇచ్చి తొలగించాలని ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని. అంతేకాక 5వ షెడ్యూల్ భూభాగం ఆదివాసుల ప్రత్యేక రక్షణ భూభాగం అని ఇక్కడ చట్టాలు అందరికీ సమానం కాదని ఇది కేవలం ఆదివాసుల రక్షణ భూభాగం అని మైదాన ప్రాంతాల నుంచి నాన్ ట్రైబల్స్ వలసలు నిషేధమని తెలియజేశారు. అంతేకాక ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం ప్రకారం నాన్ డ్రైవర్స్ ఏ రకమైన స్థిరా, చరాస్తుల బదలాయింపులు క్రయవిక్రయాలు జరపటం కూడా నిషేధమని కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ రెవిన్యూ శాఖ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITDA అధికారుల నిర్లక్ష్య ధోరణి వలన ఏజెన్సీ చట్టాలన్నీ కూడా మీరుగారిపోతున్నాయని దీంతో ఆదివాసి సంస్కృతి అంతరించిపోవటమే కాక నాన్ ట్రైబల్ జనాభా పెరుగుతుంది ఆదివాసులు జనాభా తగ్గిపోతుంది అని ఇది ఆదివాసుల ఉనికికే మహా ప్రమాదమని ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసీలు తమ ఉనికి కోసం రాజ్యాంగ హక్కుల సాధన కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయ పార్టీలు కతీతంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ చేస్తున్న దశల వారి ఉద్యమానికి కలిసి రావాలని ఈ సందర్భంగా ఆదివాసులకు పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతం మొత్తం నాన్ ట్రావెల్స్ ఆక్రమణలు తొలగించే వరకు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమం ఆగదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజం కృష్ణంరాజు, నాయకులు పూసం శ్రీను, తెల్లం శ్రీనివాసరావు, కుర్సం ముక్కమ్మ, తెల్లం మంగమ్మ, మొడియం రాముడు, కట్టం బొజ్జమ్మ, కొటం దేవీ, తెల్లం సూరి బాబు మోసం కన్నప్పరాజు, తెల్లం నాగర్జున, మరియు ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు
