
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 8
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా పూర్తి చేసుకున్న సందర్బంగా రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ ఈరోజు చింతూరులో ఎస్టి కాలనీలో పర్యటించారు డోర్ టు డోర్ భాగంగా ఎస్టీ కాలనీలో కొలువు అయిన ముత్యలమ్మ గుడి వద్ద సాంప్రదాయంగా కొబ్బరికాయ కొట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు దానిలో భాగంగా ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలో రోడ్లు బాగాలేదని ప్రజలు తెలిపారు మరియు పోలవరం నిర్వాసితులు సమస్యలు తెలపగా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తానే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకు 4000 పెన్షన్ వస్తుందో లేదో పెన్షన్ దారులను అడిగి తెలుసుకున్నారు అలాగే ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు అతి త్వరలో రైతు భరోసా గా రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందాన్నది.. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంత మంది ఉంటే ఎంతమందికి 13 వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగిందని జమ కాని వారు సచివాలయం లో ఫిర్యాదు చేసిన వారందరికీ పదో తేదీ నుంచి తల్లి ఎకౌంట్లో జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇల్ల చిన్నారెడ్డి, జమాల్ ఖాన్,జహంగీర్, ఆసిఫ్,శీలం తమయ్య,సురేష్ చౌదరి నరసింహారావు, కట్ట శంకర్, శ్రీరామ్ రెడ్డి, బాలకృష్ణ, సత్యవతి, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
