Thursday, July 10, 2025
Homeఆంధ్రప్రదేశ్లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలి. కనీస వేతనం 26,000 రూ.ఇవ్వాలిఅన్ని రంగాల కార్మికులను ప్రభుత్వ...

లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలి. కనీస వేతనం 26,000 రూ.ఇవ్వాలిఅన్ని రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సీఐటీయూ

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూలై 9

చింతూరు కేంద్రంలో మూడవసారి అధికారంలో వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మికు చట్టాలను రద్దు చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళుతుంది కావున కేంద్రంలో ఉన్న దాదాపు 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా చింతూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున అన్ని రంగాల కార్మికులతో బస్టాండ్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్మికుల సమ్మెకి ప్రజా సంఘాలు యుటిఎఫ్ గిరిజన సంఘం మహిళా సంఘం( ఐద్వా ) మద్దతు ఇవ్వడం జరిగింది.అనంతరం ఈ సభలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పండా కృష్ణయ్య గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ సిఐటియూ మండల ప్రధాన కార్యదర్శి పొడియం లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కాపాడుబోయే కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఉంది కార్మికులకి వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికుల మీద వృద్ధాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి కార్మిక హక్కులు కాపాడుకోవాలి. కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్ని రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించాలి. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలను ఆపాలి. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ప్రతి ఒక్క కార్మికుల్ని భీమా సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఉపసరించుకోవాలని. విశాఖ ఉక్కు సహ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుకరణ ఆపాలి. కొత్త లేబర్ కోడ్ సొమ్ములు ఆపాలని కార్మికులకు మెరుగైన సౌకర్యం కల్పించాలని. అన్ని రంగాలకు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా చింతూరు బస్టాండ్ లో సభ అనంతరం చింతూరు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం సమ్మె ముగించడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి మొట్టుమ్ రాజయ్య.అధ్యక్షులు కారం నాగేశ్వరావు. కారం సుబ్బారావు.మనోజ్. దిలీప్.మహిళా సంఘం అధ్యక్షులు మడివి శ్రీదేవి.అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి నూక రత్నం. ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షులు రవ్వ వీరమ్మ. వివో ఏ జిల్లా అధ్యక్షులు గొర్రె లక్ష్మయ్య. మధ్యాహ్న భోజన కార్మికులు పుష్ప. స్కూల్ శానిటైజర్ వర్కర్ యూనియన్ నాయకులు సురేష్, సుజాత. ఫీల్డ్ అసిస్టెంట్ కుంజా రామరాజు. గ్రామపంచాయతీ మడకం రాములమ్మ . జిసిసి హమాలి స్వామి. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ శానిటేషన్ వర్కర్లు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments