మొదట దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు…

July 4, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.4.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సభ కలెక్టర్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ అధికారి సాయికుమార్ అధ్యక్షతన జరిగింది…..నూ డ చైర్పర్సన్, కేశవేణు, సిపిఎంఎల్ ప్రజాపంతా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి. వి ప్రభాకర్ మాట్లాడుతూ…హైదరాబాద్ సంస్థానం పరిధిలో జాగీ ర్దారులు, దేశ్ముకులు,, నైజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రజలపై భౌతిక దాడులు,, వెట్టి చాకిరి,, మహిళలల ను హింసించడం అత్యాచారాలు చేయడం వీరి అలవాటుగా మారిందని వీరి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ రెండు మూడు దశాబ్దాల కాలం అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా అన్నారు…అంతేకాకుండా విజ్ఞప్తులు, నిరసనలు,, హక్కులు అడిగితే బూటకు కేసులు ఎన్నెన్నో భరించారు..
తాసిల్ కట్టకపోతే భూములను స్వాధీన పరచుకొని లక్షల ఎకరాలకు ఆ స్వాములైన భూస్వాముల సంఘటనలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు..వీరి దౌర్జన్యాలకు,, పేదల భూముల సాగు కొరకు పోరాటాలు చేస్తున్న సందర్భంగా 4జులై 1946 కడి వెండి గ్రామంలో శాంతియుతంగా తమ హక్కుల సాధన కొరకు ఊరేగింపు నిర్వహిస్తుంటే ఆ ఊరేగింపు పై విసునూరి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి, తల్లిజానకమ్మ వారి సాయిధ గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అన్న మల్లయ్యమొదట గాయాలు పాలైన అయినా చెదరకుండా బెదరకుండా కొమరన్న ముందు వరుసలో నిలబడి నాయకత్వం వహిస్తుండగా మరో తూటా వచ్చి పుత్తికడుపులో దిగిన తూటాతో పేగులు బయటకు వచ్చిన పేగులను అదుముకుంటూ పోరాటాలు జిందాబాద్,, ఆంధ్ర మహాసభ జిందాబాద్.. నైజాం రజాకార్ల గుండాలు ఖబర్దార్ అంటూ నినాదాలు ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు….ఈ పోరాటంలో సుమారు పది లక్షల ఎకరాలు భూములు పేదలు సాధించుకున్నారని,, 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారని, దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టిందని ఈరోజు దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కొరకు భూమిలేని పేదలకు భూములు ఇవ్వాలని,, ఇండ్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలని,, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే , పోరాటం చేయడమే దొడ్డి కొమరకు నిజమైన నివ్వాలని ఈ సందర్భంగా అన్నారు..దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని నిజాంబాద్ జిల్లా కేంద్రంతో పాటు ట్యాంక్బండ్ మీద ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది..ఈ కార్యక్రమంలో.. అఖిలభారత ఐక్య రైతు సంఘం. రాష్ట్ర కార్యదర్శి. బి. దేవారం. జిల్లా అధ్యక్షులు. సురేష్. వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్,, బీసీ సంఘ నాయకులు,, బుసాపూర్ శంకర్,, కుర్మాసంఘ నాయకులు అర్సపెల్లి గంగాధర్, మా జీ ఎంపీటీసీ సత్యనారాయణ.బోధన్ డివిజన్ బీసీ వెల్ఫేర్ అధికారి. భాగ్యవతి.. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు…

🌐 Select Language:
📰 ePaper