
దుండగులను పట్టుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం
కొమరం భీమ్ ఆవిష్కరణ కమిటీ హెచ్చరిక.
దుండగులపై ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు దేశద్రోహం కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 12
కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామంలో గల ఆదివాసి హక్కుల పోరాట యోధుడు స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీం విగ్రహాన్ని ఈనెల తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన చర్యలపై కొమురం భీం విగ్రహ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా మండిపడింది. దుండగుల చర్యలను ఖండిస్తూ ధ్వంసం చేసిన కొమరం భీమ్ విగ్రహం వద్ద విగ్రహ కోఆర్డినేషన్ కమిటీ బైటాయించి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని కమిటీ హెచ్చరించింది. ఆదివాసి పోరాట యోధులు కొమురం భీం విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఆదివాసి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం అని వారన్నారు. జరిగిన సంఘటన పై ప్రజా సంఘాలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి సంఘీభావం గా నిలబడాలని కొమరం భీమ్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కుంజా అనిల్, మడివి రవి తేజ( న్యాయవాది ), బేతి ముత్తయ్య, ఉయిక రామ్ ప్రసాద్,కరక రాజ్ కుమార్, సోడే ముత్తయ్య, పాయం వెంకటేష్, చిచ్చడి రాము,సున్నం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.