
బిసిల చిరకాల కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి
బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు చరిత్రాత్మక నిర్ణయం
షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరేక్టర్ తిప్పిశెట్టి కర్ణకర్
( పయనించే సూర్యుడు జూలై 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
బిసిల చిరకాల కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి కి, టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి మరియు మంత్రులకు మరియు స్థానిక ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ కి షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరేక్టర్ తిప్పిశెట్టి కర్ణకర్ ధన్య వాదాలు తెలిపారు ఈ సందర్భంగా
షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరక్టర్ తిప్పిశెట్టి కర్ణకర్ మాట్లాడుతూ “స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బృందానికి శుభాకాంక్షలు, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీలకు సంబంధించింది కాదు సమానత్వానికి సంబందించిన విషయం అని కర్ణకర్ అన్నారు విద్య, ఉద్యోగాలతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఈ ఏడా మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నింటిపై చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ తరఫున టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వ్యూహాత్మకంగా, సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అని కర్ణకర్ తెలిపారు.